తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. నెటిజన్లు ఏదైనా సమస్య గురించి ట్విట్టర్ లో ఆయనకు ఏదైనా చెప్పినా.. దేని గురించైనా ప్రశ్నించినా వెంటనే సమాధానం ఇస్తారు. లాక్ డౌన్ సమయంలోనూ.. ఆయన చాలా మంది ట్వీట్స్ కి స్పందించారు. ఓ చిన్నారి పాలు లేక ఏడుస్తుంది అనగానే.. వెంటనే అర్థరాత్రి మంత్రి సహాయంతో పాలు పంపించారు. కాగా.. తాజాగా ఓ వ్యక్తి రోడ్డు మీద చెత్త గురించి ట్వీట్ చేయగా.. వెంటనే స్పందించి క్లీన్ చేశారు.

 

పూర్తి వివరాల్లోకి వెళితే..  ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద కొహెడకు వెళ్లే సర్వీస్‌‌ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను పడవేశారు. దీనిపై ప్రయాణికుడు తాళ్ల బాలశివుడుగౌడ్‌ ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మంత్రి ఈ విషయాన్ని ఆదిబట్ల మున్సిపల్‌ కమిషనర్‌ సరస్వతి దృష్టికి తీసుకుపోవడంతో కమిషనర్‌ స్పందించి వెంటనే సిబ్బందితో చెత్తను తొలగించేశారు. అరగంట వ్యవధిలోనే చెత్త క్లీన్‌ కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.