Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం ఎన్నో చెప్పింది.. ఏమిచ్చింది: మోడీ సర్కార్‌పై కేటీఆర్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం ఖమ్మంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..  కేంద్రం మన దగ్గర తీసుకోవడమే కానీ ఇవ్వడంలేదని ఆరోపించారు.

ktr reiterates centre does not give anything for telangana ksp
Author
Khammam, First Published Apr 2, 2021, 5:06 PM IST

కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం ఖమ్మంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..  కేంద్రం మన దగ్గర తీసుకోవడమే కానీ ఇవ్వడంలేదని ఆరోపించారు.

విభజన చట్టంలో చెప్పింది ఏదీ కేంద్రం అమలు చేయడంలేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని మంత్రి చెప్పారు.

తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, దేశ అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.56 వేల కోట్లు కాగా, ఇప్పుడది రూ.1.40 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు.

ఖ‌మ్మం ప‌ట్ట‌ణాన్ని పువ్వాడ అజ‌య్ అద్భుతంగా తీర్చిదిద్దారని.. గాంధీ కూడ‌లిని అద్భుతంగా సుంద‌రీక‌రించారని మంత్రి ప్రశంసించారు. గ‌త ఏడేళ్లుగా అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని చెప్పారు.

ప్ర‌తి ఇంటికి మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు ఇచ్చామని.. అలాగే మ‌నం చేసిన ప‌నిని ప్ర‌జ‌ల‌కు గుర్తు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖ‌మ్మంలో ఇప్ప‌టికే ఒక స‌మీకృత మార్కెట్ ఉంది.. మ‌రో మూడు కావాల‌న్నారు త‌ప్ప‌కుండా మంజూరు చేస్తామ‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో ప్ర‌జ‌ల ఆశీర్వ‌దిస్తే మ‌రింత అభివృద్ధికి అవ‌కాశం ఉంటుంద‌ని మంత్రి స్పష్టం  చేశారు. ప‌ని చేసే ప్ర‌భుత్వాన్ని, నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు ఎప్పుడూ ఆశీర్వ‌దిస్తారు.. ఆద‌రిస్తారు అనే న‌మ్మ‌కం ఉంద‌ని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం ఎన్నో మాటలు చెప్పింది.. కానీ నిల‌బెట్టుకోవ‌డం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios