Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులపై ఆకస్మాత్తుగా ప్రేమ ఎందుకొచ్చింది:కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్, బీజేపీలకు ఆకస్మాత్తుగా  ఉద్యోగులపై ప్రేమ పుట్టుకొచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Telangana minister KTR serious comments on congress and BJP lns
Author
Hyderabad, First Published Mar 12, 2021, 1:18 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు ఆకస్మాత్తుగా  ఉద్యోగులపై ప్రేమ పుట్టుకొచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఉద్యోగులు సంతోషపడేలా పీఆర్సీ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

 కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో చోటు చేసుకొన్న పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, తెలంగాణ రాజకీయ నేతలంటే అవిశ్వాస పరిస్థితి ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించనట్టుగా ఆయన చెప్పారు.

ఆ రోజుల్లో చాలా కొద్ది మంది మాత్రమే కేసీఆర్ ను నమ్మి ముందుకు వచ్చారన్నారు. అయినా కూడ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. టీఆర్ఎస్ ను ప్రారంభించే సమయంలో కీలక అంశాలను టీడీపీ ద్వారా వచ్చిన పదవులను త్యాగం చేశారన్నారు.  మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కేసీఆర్ తెలంగాణను సాధించారని  కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిందన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలనుయ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.తెలంగాణ కంటే ముందే ఏర్పడిన రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios