Telangana: గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష సభ్యులపై కేంద్ర ఏజెన్సీల దాడులు ఎక్కువయ్యాయ‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్ర బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.  

KTR Slams Centre and BJP Government: ప్రతిపక్షాలపై కేంద్ర ఏజెన్సీల దాడులు పెరుగుతున్నాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) శనివారం అన్నారు. ఈ విధ‌మైన ధోర‌ణి ఎందుకు పెరుగుతున్న‌ద‌ని ప్రశ్నించారు. సత్య హరిశ్చంద్రతో సంబంధం ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ నేతలను కూడా కేటీఆర్ దుయ్యబట్టారు. మంత్రి ట్విటర్‌లో బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సూటి ప్ర‌శ్న‌లు సంధించారు. “గత 8 సంవత్సరాలలో బీజేపీ నాయకులు లేదా వారి బంధువులపై ఎన్ని ED, IT & CBI దాడులు జరిగాయి? క్యా సబ్ కే సబ్ బీజేపీ వాలే సత్య హరిశ్చంద్ర కే రిష్ఠేదార్ హై? #JustAsking ” అంటూ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

అంత‌కుముందు, దేశంలో 30 ఏళ్లలో కులపిచ్చి, మతపిచ్చి ఎక్కువైందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ రాకముందు ఖమ్మం పట్టణం ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ది మరో కార్పొరేషన్‌లో జరగడం లేదన్నారు. ఆయన ప్రాంతం అభివృద్ది చెందాలనే తపన ఉన్న నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ అని అన్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. 

దేశంలో కులం, మతం పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగోడుతుందని మండిపడ్డారు. మతం చిచ్చుపెట్టి.. ఆ మంటల్లో చాలికాచుకుంటుందని విమర్శించారు. విద్వేషం తప్ప మరేదానిపై బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు. ఇతర మతాలపై విషయం చిమ్మే వ్యక్తులు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. దేశంలో ఎందుకు ఈ విపరీత ధోరణులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆలోచన చేయాలన్నారు. 

కాగా, గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష సభ్యులపై కేంద్ర ఏజెన్సీల దాడులు ఎక్కువయ్యాయి. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ కస్టడీకి పంపారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను జూన్ 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి మంగళవారం ఇక్కడి కోర్టు పంపింది. ఈడీ కేసులో జైన్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. జైన్ బంధువులకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ అటాచ్ చేసింది.