టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ట్విట్టర్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో టచ్ లో ఉంటూ.. వారు చేసే ట్వీట్స్ కి రిప్లై కూడా ఇస్తుంటారు. గతంలో మంత్రి ఉన్నా సమయంలోనూ ఆయన ట్విట్టర్ వేదికగా చాలా సమస్యలు పరిష్కరించారు.

కాగా.. తాజాగా ఆయన ఓ సినిమాపై, ఆ సినిమాలో నటించిన హీరోపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా..సినిమాలకు కూడా కొంత సమయం కేటాయిస్తారని తెలుస్తోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.. కేటీఆర్ కేజీఎఫ్ సినిమా గురించి ట్విట్టర్ లో స్పందించారు.

‘కొద్దిగా ఆల‌స్యంగా అయినా.. చివరికి `కేజీఎఫ్‌` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది.. సాంకేతికంగా, కథాపరంగా ఆకట్టుకుంది. కథను ఉత్కంఠంగా చూపించారు.. మరోపక్క కూల్‌గానూ అనిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్‌ఫై రాక్‌స్టార్ య‌ష్ నటన అదరిపోయింది’అని ప్రశంసలు కురిపించారు. 

ఈ సినిమా కన్నడ,  తమిళ, తెలుగు, మళయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ కాసుల వర్షం కురిపించింది.