తెలంగాణలో ఇప్పుడు ఓ ఫోన్ సంభాషణ కలకలం రేపుతోంది. కేటీఆర్ కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ల సంభాషణ లీక్ అవ్వడంతో రచ్చగా మారింది.
రంగారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వర్గాల్లో హీట్ పెరుగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఫోన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరి ఫోన్ వ్యవహారం బయటికి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం చెలరేగింది. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోన్ సంభాషణ రచ్చ రచ్చగా మారింది.
జైపాల్ యాదవ్ కు మంత్రి కేటీఆర్ కాల్ చేశారు. ఆ సమయంలో ఫోను స్పీకర్ లో పెట్టి మాట్లాడారు జైపాల్ యాదవ్. ఇంతకీ వారేం మాట్లాడుకున్నారంటే… జైపాల్ కు ఫోన్ చేసిన కేటీఆర్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ బిఆర్ఎస్ లో జాయినింగ్ విషయం సార్ తో మాట్లాడానని, పదవుల విషయం ఎన్నికల తర్వాత చూద్దామని… ఇప్పుడైతే అతడిని పార్టీలో చేరమని సార్ చెప్పారని కేటీఆర్ జైపాల్ కు తెలిపారు. దీనికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉప్పల వెంకటేష్ తో మాట్లాడతానని జవాబు ఇచ్చారు.
నాగార్జున సాగర్ నుండి పోటీకి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తి: మామ కోసం అల్లు అర్జున్ ప్రచారం?
అయితే.. ఈ ఫోన్ కాల్ వ్యవహారం ఎంతవరకు నిజమో తెలియదు. కానీ, పాలమూరు జిల్లాలో మాత్రం ఇప్పుడు ఈ ఫోన్ కాల్ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వం విషయంలో బీఆర్ఎస్ ఇప్పటివరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇదే సమయంలో ఫోన్ వ్యవహారం బహిర్గతం అయింది. దీంతో జైపాల్ యాదవ్ మరింత సంకట స్థితిలో పడినట్లుగా సమాచారం.
