Asianet News TeluguAsianet News Telugu

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ గౌరవం.. ఆ యూనివర్శిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం..

KTR: మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది.  బోస్టన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'హార్వర్డ్ ఇండియా' వార్షిక కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాల్సిందిగా ఆహ్వానం పంపింది. 

KTR invited to speak at Harvard University KRJ
Author
First Published Oct 15, 2023, 4:23 AM IST

KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది.  బోస్టన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'హార్వర్డ్ ఇండియా' వార్షిక కాన్ఫరెన్స్‌కి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఈ యూనివర్సిటీలో  వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న  ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్‌లో ఫైర్‌సైడ్ చాట్‌లో మాట్లాడేందుకు ఐటీ మంత్రి కెటి రామారావుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో 'ఇండియా రైజింగ్: బిజినెస్, ఎకానమీ అండ్ కల్చర్' అనే అంశంపై చర్చ జరగనుంది.

‘తెలంగాణ సాధించిన అభివృద్ధిలో మీ ప్రభావవంతమైన నాయకత్వం, తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడం మాకు గొప్ప ప్రేరణగా నిలస్తున్నది’ అని హార్వర్డ్‌ యూనివర్శిటీ తమ ఆహ్వానంలో పేర్కొంది. హార్వర్డ్‌లోని ఇండియా కాన్ఫరెన్స్ యునైటెడ్ స్టేట్స్‌లో విద్యార్థులచే నిర్వహించబడే అతిపెద్ద ఈవెంట్‌లలో  విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపార నాయకులు , విధాన నిపుణులతో సహా 1,000 మంది ప్రవాస భారతీయులు పాల్గొంటారు. గతంలో అజీమ్‌ ప్రేమ్‌జీ, అమర్త్యసేన్‌, అనామికా ఖన్నాసహా పలువురు మంత్రులు, వ్యాపార ప్రముఖులు, విద్యావేత్తలు, సాంస్కృతిక దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ను పాల్గొనాలకు ఆహ్వానం పంపారు.

హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందినందుకు సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ప్రగతిశీల విధానాలను ప్రదర్శించడానికి , వివిధ రంగాలలో రాష్ట్రం అందిస్తున్న అవకాశాలను హైలైట్ చేయడానికి ఈ సదస్సు గొప్ప వేదిక అవుతుందని అన్నారు . గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం సాధించిన ప్రగతిని, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా దాని సామర్థ్యాన్ని ఈ సంవత్సరం సమావేశం ప్రదర్శిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios