హైదరాబాద్: ఓటేసి ప్రతి ఒక్కరూ  తమకు నచ్చిన నాయకుడిని, నచ్చిన  పార్టీని ఎన్నుకోవాలని  తెలంగాణ  అపద్ధర్మ మంత్రి కేటీఆర్ కోరారు.

హైద్రాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకొన్నామని కేటీఆర్ చెప్పారు. రాజకీయాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితాలను  నిర్ధేశిస్తాయని కేటీఆర్ చెప్పారు.

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మీకు నచ్చిన నాయకుడిని మీకు నచ్చిన పార్టీని ఎన్నుకోవాలని కేటీఆర్ ప్రజలను కోరారు. 

ఓటు హక్కును వినియోగించుకోకుండా భవిష్యత్తును నిర్ధేశించుకోవాలని  ఆయన  కోరారు.  కేటీఆర్ సతీమణి  శైలిమ శుక్రవారం ఉదయం పూటే  తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.