ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.... ప్రధాని మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు గుజరాత్ వెళ్లారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా  సందర్శించారు. కేటీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.