Asianet News TeluguAsianet News Telugu

సింహాలకు సోకింది కొవిడ్ 19 కాదు.. జంతువులనుంచి మనుషులకు సోకదు..

జూ పార్క్ లో 8 సింహాలకు సంక్రమించిన వైరస్.. మానవులకు సోకిన కోవిడ్-19 వైరస్ ఒకటి కాదని ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ పశు వైద్యశాల (నారాయణగూడ) సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Kovid 19 is not infected with lions.. hyderabad zoo lions : bsb
Author
Hyderabad, First Published May 7, 2021, 10:12 AM IST

జూ పార్క్ లో 8 సింహాలకు సంక్రమించిన వైరస్.. మానవులకు సోకిన కోవిడ్-19 వైరస్ ఒకటి కాదని ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ పశు వైద్యశాల (నారాయణగూడ) సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఈ వార్తలు వచ్చాక, ఆసుపత్రికి పెంపుడు శునకాలు, ఇతర జంతువుల తాకిడి పెరిగిందా అని న్యూస్ టుడే ఆయన్ని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్నారు. సాధారణ ఓపీనే నమోదవుతోందన్నారు. 

కరోనా శునకాలకు అంటుకుంటుందా అంటూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ‘సార్స్-2 వైరస్ లలో కొవిడ్-19 ఒకటి. ఇది మనుషులను పీడిస్తుంది. సింహాలకు వచ్చింది మాత్రం అది కాదు’ అని కేంద్రం నిర్థారించిందని పేర్కొన్నారు. 

కుక్కలకు కరోనా వైరస్ 20 ఏళ్లుగా ఉంది, టీకాలు వేస్తున్నాం, శునకాలకు, జంతువులకు సోకిన వైరస్ మనుషులకు సోకదని’ స్పష్టం చేశారు. 

 హైద్రాబాద్‌ని నెహ్రు జూలాజికల్ పార్క్‌లోని 8 సింహాలకు కరోనా నిర్ధారణ అయింది. దేశంలో తొలిసారిగా  కరోనా సోకిందని అధికారులు తెలిపారు.హైద్రాబాద్ లోని నెహ్రు జూలాజికల్ పార్క్ లో ఉన్న సింహాలు కొన్ని రోజులు అనారోగ్యంగా ఉన్నాయి. దీంతో వీటి శాంపిళ్లను  జూపార్క్ అధికారులు సీసీఎంబీకి  పంపారు.  ఈ ఎనిమిది సింహాలకు కరోనా సోకిందని సీసీఎంబీ తేల్చింది.

కాగా, హైద్రాబాద్‌లోని జూపార్క్‌లోని 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ సింహాల నుండి శాంపిళ్లను సేకరించి సీసీఎంబీకి పంపారు అధికారులు. కరోనా వైరస్ కారణంగా  అమెరికాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడ కరోనా కారణంగా జంతువులు మరణించిన విషయం తెలిసిందే. 

తాజాగా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ ఇండియాలో పెద్ద ఎత్తున కేసులు రికార్డు అవుతున్నాయి. హైద్రాబాద్ లోని నెహ్రు జూలాజికల్ పార్క్ లో ఉన్న సింహాలు కొన్ని రోజులు అనారోగ్యంగా ఉన్నాయి. దీంతో వీటి శాంపిళ్లను  జూపార్క్ అధికారులు సీసీఎంబీకి తరలించారు. 

హైద్రాబాద్‌ 'జూ'లో కరోనా కలకలం:ఎనిమిది సింహాలకు కోవిడ్...

ఇవాళ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. సీసీఎంబీ రిపోర్టు ఆధారంగా  జంతువులకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. 

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. లాక్ డౌన్ విషయంలో నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అప్పగించింది. మరో వైపు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios