‘పెళ్లి చేసుకోకుంటే యాసిడ్ పోస్తా’.. ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు.. కోఠి ఉమెన్స్ కాలేజ్ ప్రొఫెసర్ అరెస్ట్..
కలిసి చదువుకున్న నేరానికి ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేశాడో లెక్చరర్. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వేధించాడు.
కరీంనగర్ : Social mediaలో love పేరుతో యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్న యువకుడిపై కరీంనగర్ పోలీసులు arrest చేశారు. వివరాల్లోకి వెళితే.. కోటి ఉమెన్స్ కాలేజీ లో Sanskrit teacherగా పనిచేస్తున్న ఆదిత్య భరద్వాజ్, కరీంనగర్లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీ లో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు. కొద్ది రోజుల స్నేహం తర్వాత ఆ యువతిని ప్రేమిస్తున్నానని తెలుపగా ఆమె నిరాకరించింది.
అప్పటి నుంచి కక్ష పెంచుకున్న భరద్వాజ్ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. స్నేహంగా వుండే రోజుల్లో యువతి కుటుంబ సభ్యులతో తీయించుకున్న పాత ఫోటోలను మార్పింగ్ చేసి వేధించసాగాడు. వీలైన ప్రతిచోటా ఆన్లైన్లో యువతికి, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడి పోస్తానని బెదిరింపులకు గురి చేసేవాడు. తెలంగాణ మోడల్ స్కూల్ గంగాధర సోషల్ మీడియా అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి ఈనెల 10న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. భరద్వాజ్ కదలికలపై దృష్టిపెట్టారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్ కు వెళ్లగా అక్కడ అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేయగా కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై వనపర్తిలోని ఒక పోలీసు అధికారి వివరణ ఇస్తూ.. కిడ్నాప్ కాదు ఓ కేసులో అరెస్టు చేసినట్లు వివరించారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో బుదవారం వెలుగులోకి వచ్చింది. నగరంలో Rapido driver లైంగిక వేధింపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎనిమిదిమంది కాలేజీ అమ్మాయిలకు Message రూపంలో అర్ధ నగ్న ఫోటోలు పెట్టి Sexual harassmentకు గురి చేస్తున్నాడు. అగంతకుడి చిత్రహింసలతో విసిగిపోయిన బాధిత యువతులు షీ టీమ్స్ ను ఆశ్రయించారు. దీంతో విజయ్ కుమార్ అనే ర్యాపిడో డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామవాంఛతో ఇలా ఆడపిల్లల్ని వేధిస్తున్నట్లు విజయ్కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.
కాగా, మే 19న ఓ కౌన్సిలర్ లైంగిక వేధింపులు ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చాయి. తనను వేధిస్తున్న YCP Councilor మీద వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. Sri Sathyasai District పెనుకొండ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కౌన్సిలర్ శేషాద్రి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె భర్తను Liquorనికి బానిసచేసి, తరచుగా ఇంటివద్దకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్థరాత్రి ఇంటి తలుపు కొట్టడం, రాళ్లు విసరడం చేస్తున్నాడు.
దీంతో విసిగిపోయిన బాధితురాలు పదిరోజుల క్రితం శేషాద్రిని పెనుగొండ ఆర్టీసీ బస్టాండు వద్ద చెప్పుతో కొట్టింది. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. అతడి వికృత చేష్టలు భరించలేక బాధితురాలు పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.