Asianet News TeluguAsianet News Telugu

నా కొడుకు రాఘవను పోలీసులకు అప్పగిస్తా: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ

తన కొడుకు రాఘవపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించారు.

Kothagudem MLA Vanama Venkateswara rao open letter on Rama krishna family suicide
Author
Kothagudem, First Published Jan 6, 2022, 2:25 PM IST

ఖమ్మం:  తన కొడుకు రాఘవపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని  కొత్తగూడెం ఎమ్మెల్యే Vanama Venkateshwara rao ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రజలకు బహిరంగ లేఖ రాశాడు.

ఈ నెల 3 వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన Ramakrishna కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తన suicide కు వనమా రాఘవేందర్ రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు ప్రకటించారు. ఈ మేరకు selfie వీడియోను తీశాడు.ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది. 

ఈ విషయమై  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. బహిరంగ లేఖ రాశారు. తన కొడుకు  vanama Raghavendra raoను పోలీసులకు అప్పగిస్తానని వనమా వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. పోలీసులకు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కోరారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా నా కొడుకుని అప్పగిస్తానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు చెప్పారు.రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన తర్వాత వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. 

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసకోవడం తనను తీవ్ర మనో వేదనకు గురి చేసిందన్నారు. రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియో తనను తీవ్ర క్షోభకు గురి చేసిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.త రాఘవ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొనే వరకు ఆయనను నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పారు. పార్టీలు, వ్యక్తుల ఆరోపణలను తాను పట్టించుకోనని చెప్పారు.

also read:వనమా రాఘవేందర్ రావును అరెస్ట్ చేయాలి: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్

రామకృష్ణ  కుటుంబం ఆత్మహత్యతో మరోసారి వనమా రాఘవేందరరావు కొత్తగూడెం నియోజకవర్గంలో పాల్పడుతున్న అరాచకాలు మరోసారి వెలుగు చూశాయి. గతంలో కూడా అనేక కేసులు వనమా రాఘవేందరరావుపై నమోదయ్యాయి. కేసులు నమోదు కాని ఘటనలు కూడా ఉన్నాయని కూడా స్థానికులు చెబుతున్నారు. గతంలో నమోదైన కేసుల్లో వనమా రాఘవేందర్ రావుపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే  రామకృష్ణ కుటుంబ ఆత్మహత్యకు పాల్పడేది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

వనమా రాఘవేందరరావు వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా రామకృష్ణ సూసైడ్ లేఖ రాశాడు. సూసైడ్ లేఖతో పాటు సెల్ఫీ వీడియోను కూడా రికార్డు చేశాడు.  సెల్పీ వీడియో మీడియాలో ప్రసారం కావడంతో  విపక్షాలు ఆందోళనకు దిగాయి. పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసాన్ని బీజేపీ నేతలు ముట్టడించారు.  ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నెల రోజుల క్రితమే పాల్వంచలో  ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఆత్మహత్య చేసుకొన్న బాధితుడు కూడా వనమా రాఘవేందర్ రావు పేరును సూసైడ్ లేఖలో రాశాడు. అయితే  ఈ కేసు నుండి రాఘవేందర్ రావు బెయిల్ పై బయటకు వచ్చాడు.ఆ తర్వాత మరోసారి రామకృష్ణ కేసులో  పోలీసులకు చిక్కకుండా అదృశ్యమయ్యాడు. 
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు తాను కారణం కాదని మీడియాకు రాఘవేందర్ రావు వీడియోను రిలీజ్ చేశాడు. మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో కూడా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు తనకు సంబంధం లేదని చెప్పుకొన్నాడని చెప్పాడు.పోలీసుల విచారణకు సహకరిస్తానని ప్రకటించారు. కానీ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు.  వనమా రాఘవేందర్ రావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios