Asianet News TeluguAsianet News Telugu

యశోదకు కొత్త ప్రభాకర్ రెడ్డి: మూడు ఇంచుల గాయం, హరీష్ రావు పరామర్శ (వీడియో)


సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి కొత్త ప్రభాకర్ రెడ్డిని తరలించారు . యశోద ఆసుపత్రిలో  వైద్యులు  ప్రభాకర్ రెడ్డికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.  

kotha Prabhakar Reddy shifted to yashoda hospital lns
Author
First Published Oct 30, 2023, 4:00 PM IST


హైదరాబాద్: దుబ్బాక  బీఆర్ఎస్ అభ్యర్ధి  కొత్త ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.  సోమవారంనాడు  సూరంపల్లిలో  రాజు అనే వ్యక్తి  కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో  కొత్త ప్రభాకర్ రెడ్డికి  ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అనంతరం ఆయనను సికింద్రాబాద్  యశోద ఆసుపత్రికి తరలించారు.

 

యశోద ఆసుపత్రిలో  కొత్త ప్రభాకర్ రెడ్డికి  వైద్యులు  సర్జరీ  చేయనున్నారు.  రాజు దాడి చేయడం వల్ల  కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో  మూడు ఇంచుల గాయమైందని  వైద్యులు గుర్తించారు.  ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీష్ రావు  హుటాహుటిన తన కాన్వాయ్ తో  సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి ప్రభాకర్ రెడ్డిని తీసుకు వచ్చారు.  అంతకు ముందు గజ్వేల్ ఆసుపత్రిలో  వైద్యులను  మంత్రి హరీష్ రావు  అప్రమత్తం చేశారు.   సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో  వైద్యులు  కొత్త ప్రభాకర్ రెడ్డిన పరీక్షించి  శస్త్రచికిత్స  చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

also read:కఠిన చర్యలు తీసుకోవాలి: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై

కొత్త ప్రభాకర్ రెడ్డికి కత్తిపోట్ల కారణంగా  కడుపులో రక్తస్రావాన్ని వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స కోసం ప్రభాకర్ రెడ్డిని వైద్యులు ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు.  ఈ దాడి కారణంగా  ప్రభాకర్ రెడ్డి ఏ అవయవాలు  దెబ్బతిన్నాయో వైద్యులు  పరీక్షిస్తున్నారు.  శస్త్రచికిత్సకు ముందు అవసరమైన ఫార్మాలిటీస్ ను  వైద్యులు తీసుకున్నారు.  

ఇదిలా ఉంటే  కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడిన రాజును పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  ప్రభాకర్ రెడ్డిపై రాజు ఎందుకు దాడి చేశాడనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ రెడ్డిపై రాజు దాడికి పాల్పడగానే  బీఆర్ఎస్ శ్రేణులు అతడిని చితకబాదారు.  ఇదిలా ఉంటే  కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  విచారం వ్యక్తం చేశారు.  ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని గవర్నర్  డీజీపీని ఆదేశించారు. మరో వైపు ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.చేతకాని దద్దమ్మలే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios