కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి, తెరాస పార్టీ కి మధ్య ఉన్న అగాథం మనందరికీ తెలిసిందే. గత ఎన్నికల సందర్భంగా ఆ విషయాన్నీ అందరూ చూసినవారే. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి థాంక్స్ అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక ట్వీట్ చేసారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏమిటి కేసీఆర్ కి థాంక్స్ చెప్పాడు అని అనుకుంటున్నారా... ఆయన థాంక్స్ చెప్పిందయితే నిజం. కానీ సెటైరికల్ గా. కేసీఆర్ చేసిన యాగాల వల్లనే తెలంగాణాలో వర్షపాతం 35 శాతం అధికంగా నమోదయ్యిందని అంటూనే.... తమ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కాలువను కూడా తవ్వలేదని విరుచుకుపడ్డారు. 

7 సంవత్సరాల కింద తమ ప్రాంతానికి సాగుకు కృష్ణ నీరందిస్తానని కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదని, అన్ని అబద్ధపు మాటలు, బూటకపు వాగ్ధానాలే అని ఆయన ఎద్దేవా చేసారు. మిమ్మల్ని అబద్ధాలకోరు అనడం సబబే కదా అంటూ ఫైనల్ పంచ్ వేశారు కొండ.