Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌కు షాక్.. హుజురాబాద్‌లో పోటీ చేయలేను: తేల్చిచెప్పేసిన కొండా సురేఖ

హుజురాబాద్ ఉపఎన్నికలో అభ్యర్ధి ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. ఈ ఉపఎన్నికలో పోటీ చేయలేనని కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ తేల్చిచెప్పారు. దీంతో హుజురాబాద్‌లో మరో అభ్యర్ధి వేటలో కాంగ్రెస్ తలమునకలైంది. 

konda surekha not interested in contest in huzurabad by poll
Author
Hyderabad, First Published Sep 30, 2021, 7:10 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికలో అభ్యర్ధి ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. ఈ ఉపఎన్నికలో పోటీ చేయలేనని కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ తేల్చిచెప్పారు. దీంతో హుజురాబాద్‌లో మరో అభ్యర్ధి వేటలో కాంగ్రెస్ తలమునకలైంది. 

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్ధిత్వంపై ఆ పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. టీఆర్ఎస్,బీజేపీలకు ధీటైన అభ్యర్ధిగా కొండా సురేఖ నిలుస్తారని కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. ఒకవేళ హుజురాబాద్‌లో పోటీ చేసినా మళ్లీ వరంగల్‌కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీచేస్తానని కొండా సురేఖ తేల్చి చెప్పారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 2018 శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి గణనీయమైన ఓట్లే వచ్చాయి. గతంలో వచ్చిన ఓట్లను నిలుపుకొనేందుకు కొండా సురేఖను బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కొండా సురేఖ సామాజికవర్గమైన పద్మశాలీలు, ఆమె భర్త కొండా మురళి సామాజికవర్గమైన మున్నూరుకాపు ఓటర్లు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో కొండా సురేఖ వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపుతుందనే ప్రచారం కూడా లేకపోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios