హైదరాబాద్: కొండా దంపతులు బిజెపిలో చేరుతారంటూ గత కొద్ది కాలంగా సాగుతున్న ప్రచారానికి తెర పడింది. మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ తో భేటీ అయ్యారు. కొత్త పిసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో భాగంగా మాణిక్యం ఠాగూర్ పార్టీ తెలంగాణ నేతలతో మాట్లాడుతున్నారు.

ఠాగూర్ సంప్రదింపుల్లో భాగంగా కొండా సురేఖ, కొండా మురళి తమ అభిప్రాయానని వెల్లడించారు. వారు శుక్రవారం కాంగ్రెసు కార్యాలయం గాంధీ భవన్ వచ్చి మాణిక్యం ఠాగూర్ తో మాట్లాడారు దీంతో వారు బిజెపిలో చేరుతారనే ప్రచారానికి తెర పడింది.

త్వరలో జరిగే వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలపై కూడా కొండా దంపతులతో మాణిక్యం ఠాగూర్ చర్చలు జరిపారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించలని ఆయన వారికి సూచించారు జిల్లాలోని నేతలను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. 

కాంగ్రెసు నుంచి టీఆర్ఎస్ లో చేరిన కొండా సురేఖ దంపతులు మళ్లీ కాంగ్రెసులో చేరారు. టీఆర్ఎస్ ను వీడే సమయంలో కొండా సురేఖ తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు.