Telangana Congress BC Reservation Protest : దేశ రాజధాని డిల్లీలోనే దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే…

DID YOU
KNOW
?
కొండా సురేఖ వివాదాలు
'పనుల కోసం వచ్చే కంపెనీల వద్ద మంత్రులు డబ్బులు తీసుకుంటారు. నేను పైసా తీసుకోకుండా సమాజ సేవ చేయాలని సూచిస్తున్నా' ఇవి కొండా సురేఖ వివాదాస్పద కామెంట్స్

Konda Surekha : తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. గతంలో హీరో నాగార్జున కుటుంబం గురించి ఈమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత కూడా కొండా దంపతుల రాజకీయ వ్యవహారాలు వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాక రేపాయి. ఇలా జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివాదాలను రాజేసిన కొండా సురేఖ ఇప్పుడు దేశంపై పడ్డారు. ఏకంగా దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిసి రిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తెలపాలని కోరుతూ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేపడుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు డిల్లీబాట పట్టారు. డిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన బిసి బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతున్నారు.

కాంగ్రెస్ మహాధర్నా లైవ్ వీడియో

ఈ మహాధర్నాలో పాల్గొన్న కొండా సురేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ భవన ప్రారంభోత్సవానికి అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని ఈ ప్రభుత్వం ఆహ్వానించలేదు... ఆమె వితంతువు కాబట్టే మోదీ పిలవలేదని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత చేపట్టిన ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవలేదు... ఆమె ఎస్సి మహిళల కాబట్టే ఇక్కడికి కూడా మోదీ సర్కార్ రానివ్వలేదని సురేఖ అన్నారు. బిజెపి నరనరాన కులాల ఆలోచనలతో కూడిన రక్తం పారుతోందని కొండా సురేఖ అన్నారు. ఇలా తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Scroll to load tweet…