హైదరాబాద్: నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం నాడు  ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కూతురుకు తొలిసారి ఓటు హక్కును పొందింది. ఓటు హక్కును  వినియోగించుకొనేందుకు తల్లిదండ్రులతో  కలిసి ఆమె నల్గొండలో ఓటు వేశారు. తొలిసారిగా ఓటు వేయడం తనకు సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. ఓటు హక్కును  వినియోగించుకొనేందుకు  ఓటర్లు బారులు తీరడం మంచి పరిణామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

ఈ దఫా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కూడ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్  సరిగా లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందిపడుతున్నారని.... ఈ విషయాన్ని కలెక్టర్  దృష్టికి తీసుకెళ్తనున్నట్టు చెప్పారు.

నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి 1999  నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో  ఇండిపెండెంట్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై  స్వల్ప మెజారిటీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.