Asianet News TeluguAsianet News Telugu

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ ప్రమాణం: జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు.

komatireddy brothers and jeevan reddy not attend to Revanth swearing ceremony lns
Author
Hyderabad, First Published Jul 7, 2021, 2:54 PM IST

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు.టీపీసీసీ చీఫ్ పదవికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడ ఒక దశలో ఖరారైందనే ప్రచారం సాగింది. అధికారికంగా  ప్రకటనే తరువాయి అనే సమయంలో  ఈ ప్రకటన వాయిదా పడింది. 

also read:టీపీసీసీకి కొత్తబాస్: గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

అదే సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం నెలకొంది. దీంతో పీసీసీ చీఫ్ ప్రకటనను నిలిపివేయాలని జానారెడ్డి కోరారు. దీంతో  ఈ ప్రక్రియ నిలిచింది. తాజాగా రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది.ఇవాళ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జీవన్ రెడ్డి దూరంగా ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే తప్పుబట్టారు. గాంధీ భవన్  మెట్లెక్కనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ పదవికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ చివరి వరకు పోటీలో ఉన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios