నల్గొండ:నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాలో 10 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆ పార్టీ చెప్తుందని అదే జరిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. 

ఎన్నికల్లో గెలిచినా సరే పదిమంది టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే తాను రాజీనామా చేస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 13 స్థానాలు ఉండగా వాటిలో 10 స్థానాలు గెలుస్తామని టీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉంది. అయితే పది గెలిస్తే తాను గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

మహాకూటమి ఉన్నా... లేకున్నా గెలుపు మాదే : కేసీఆర్, కేటీఆర్‌లకు కోమటిరెడ్డి సవాల్

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి