నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న చిరుమర్తి.. రెండు మూడు రోజుల్లో కారు ఎక్కనున్నారు. కాగా..దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా స్పందించారు.
చిరుమర్తి లింగయ్య పార్టీ మారడం తనకు చాలా బాధకలిగిందని ఆయన అన్నారు. లింగయ్య ఇంత నమ్మకద్రోహం చేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. లింగయ్య పార్టీ మారుతున్నాడన్న విషయం టీవీలో చూసేంతరకు తనకు తెలీదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. లింగయ్య కు రెండు సార్లు పార్టీ టికెట్ ఇప్పించి.. గెలుపు కోసం కృషి చేశానని గుర్తు చేసుకున్నారు.
తనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే లింగయ్య పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. లింగయ్య పార్టీ మారడం కాంగ్రెస్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. పార్టీ సంగతి పక్కన పెడితే.. ఎక్కువ బాధ కోమటిరెడ్డి బ్రదర్స్ కే.
చిరుమర్తి లింగయ్య ముందునుంచి కూడా కోమటిరెడ్డి వర్గానికి గట్టి మద్దతుదారుగా నిలుస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో చిరుమర్తికి పార్టీ టిక్కెట్ వస్తుందో రాదో అన్న ఊగిసలాట జరిగినపుడు కోమటి రెడ్డి బ్రదర్సే దగ్గరుండి చిరుమర్తికి టిక్కెట్ ఖరారు చేయించారు. ఇప్పుడు కనీసం కోమటిరెడ్డి బ్రదర్స్ ని సంప్రదించకుండానే.. కారు ఎక్కేందుకు నిర్ణయం తీసుకున్నారు.
