Asianet News TeluguAsianet News Telugu

మార్చి నాటికి కొల్లూరు మెగా హౌసింగ్ కాలనీ: సదుపాయాలు ఇవీ... (వీడియో)

కొల్లురు ఇళ్ల‌ కాలనీని దేశంలోనే మోడల్ కాలనీగా రూపొందిస్తున్నామ‌ని, ఈ కాల‌నీలో అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్తాయిలో క‌ల్పిస్తున్న‌ట్టు స్పెష‌ల్ సీఎస్ తెలిపారు.

Kolluru nega housing colony will be completed by march
Author
Kollur, First Published Jul 20, 2019, 5:58 PM IST

రామచంద్రపురం: రామ‌చంద్ర‌పురం మండ‌లం కొల్లూర్‌లో రూ.1354.59 కోట్ల వ్యయంతో చేప‌ట్టిన 15,660 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ మెగా ప్రాజెక్ట్ మార్చి మాసాంతంలోగా పూర్తిచేసి ల‌బ్దిదారుల‌కు అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  కొల్లూరులోని  124 ఎక‌రాల విస్తీర్ణంలో 117 బ్లాకుల్లో అత్యాధునిక షీర్వాల్ టెక్నాల‌జితో జీహెచ్ఎంసీ చేప‌ట్టిన ఈ మెగా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  చిత్రా రామ‌చంద్ర‌న్ శనివారంనాడు ఆకస్మికంగా తనీఖీ చేశారు. 

కొల్లూరు ఇళ్ల‌ను నాణ్యతా ప్రమాణాలతో నిర్మిచడo, ఇళ్ల నిర్మాణాల‌లో అధికారులు మంచి టీం వర్క్ తో పనిచేయడం పట్ల స్పెష‌ల్ సీఎస్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. కొల్లూరు మెగా  హౌసింగ్ కాల‌నీ నిర్మాణాన్ని 2020 మార్చి మాసంలో పూర్తి అవుతాయ‌ని ప్ర‌క‌టించారు. కేవ‌లం 10 నెల‌ల క్రితం ప్రారంభించిన ఈ ఇళ్ల నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతున్నాయ‌ని, ముఖ్యంగా ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనూ ఈ నిర్మాణ ప‌నులు ఇంత వేగ‌వంతంగా జ‌ర‌గ‌డం ప‌ట్ల ప‌లువురు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. 

"

కొల్లురు ఇళ్ల‌ కాలనీని దేశంలోనే మోడల్ కాలనీగా రూపొందిస్తున్నామ‌ని, ఈ కాల‌నీలో అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్తాయిలో క‌ల్పిస్తున్న‌ట్టు స్పెష‌ల్ సీఎస్ తెలిపారు. కొల్లూరు హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికి టైంలైన్‌ను ని నిర్ధేశించుకొని, అందుకు అనుగుణంగా ప‌నులు కొన‌సాగ‌డంపై సంతృప్తి వ్య‌క్తం చేశారు. దేశంలోనే  బలహీన వర్గాలకు ఉచితం గా 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను ఒకే దగ్గర నిర్మించిన దాఖలాలు లేవని, ఇంతటి ప్ర‌తిష్టాత్మ‌క‌ ప్రాజెక్ట్ ను మోడల్ సిటీగా రూపొందించనున్నట్టు చిత్రా రామ‌చంద్ర‌న్‌ వెల్లడించారు. 

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దార్శ‌నికత‌కు ప్ర‌తిరూప‌మైన డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ఉత్త‌మ ప్ర‌మాణాల‌తో కూడిన బ‌ల్డింగ్ మెటీరియ‌ల్‌ను ఉప‌యోగించ‌డంతో పాటు థ‌ర్డ్ పార్టీ ద్వారా నాణ్య‌త‌ప్ర‌మాణాల‌ను త‌నిఖీ చేయిస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌, గృహ‌నిర్మాణ అధికారులు పాల్గొన్నారు.

కొల్లూరులో మెగా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం 

ఒకే చోట 15,660 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడుతుంది జీహెచ్ఎంసి. చిన్న‌పాటి న‌గ‌రంగా రూపొందే ఈ మెగా డ‌బుల్ బెడ్‌రూం సిటీ నిర్మాణాన్ని రామ‌చంద్ర‌పురంలోని కొల్లూరు గ్రామంలో నిర్మిస్తోంది.మొత్తం నిరుపేద ల‌బ్దిదారులకు ఉచితంగా నిర్మించ‌నున్న ఈ డిగ్నిటీ హౌజింగ్‌ను కొల్లూరులో 124 ఎక‌రాల స్థ‌లంలో రూ. 1354.59 కోట్ల వ్య‌యంతో చేప‌డ్తున్నారు. మొత్తం 117 హౌజింగ్ బ్లాకుల్లో ఎస్-9, ఎస్‌+10, ఎస్‌+11 అంత‌స్థుల్లోనిర్మించనున్న ఈ కాల‌నీని దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన, మ‌రెక్క‌డా లేనివిధంగా అన్ని సౌక‌ర్యాల‌తో నిర్మించ‌డం ద్వారా మోడ‌ల్ సిటీగా మార‌నుంది.

"

సదుపాయాలు ఇవీ....

* ఒకొక్క ఇంటికి రూ. 7.90ల‌క్ష‌ల వ్య‌యం. మ‌రో 75వేల రూపాయ‌ల‌తో మౌలిక సుదుపాయాల క‌ల్ప‌న‌.

* అంత‌ర్గ‌త సి.సి రోడ్లు, స్టార్మ్ వాట‌ర్ డ్రైయిన్లు.

* మంచినీటి స‌ర‌ఫ‌రా

* అంత‌ర్గ‌త డ్రైనేజీతో పాటు సీవ‌రేజ్ ప్లాంటు (ఎస్‌.టి.పి) నిర్మాణం.

*వీధి విద్యుత్ దీపాలు.

* ఘ‌న వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ ఏర్పాటు.

* క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ నిర్మాణం.

* క‌మ్యునిటీ కాంప్లెక్స్‌

* పాఠ‌శాల, అంగ‌న్‌వాడి కేంద్రాల ఏర్పాటు

* బ‌స్టాప్‌, పోలీస్ స్టేష‌న్‌, ఫైర్ స్టేష‌న్‌, పెట్రోల్ బంక్ నిర్మాణం.

* వివిధ మ‌తాల ప్రార్థ‌నా కేంద్రాల ఏర్పాటు.

* షియ‌ర్‌ వాల్ సాంకేతిక ప‌ద్ద‌తిలో నిర్మాణం.

* మొత్తం 15,660 డ‌బుల్ బెడ్ రూమ్‌లు క‌లిపి 96,75,100 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం.

* ప్ర‌తి బ్లాకుకు రెండు మెట్ల దారి. ప్ర‌తి మెట్ల దారి 3మీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మాణం.

* ప్ర‌తి బ్లాకుకు 8మందిని తీసుకెళ్లే కెపాసిటి క‌లిగిన రెండు లిఫ్టుల ఏర్పాటు.

Follow Us:
Download App:
  • android
  • ios