తెలంగాణ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు కోదండరామ్ మద్దతు.. ఎన్నికల్లో పోటీకి దూరంగా టీజేఎస్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్‌ మద్దతు కోరామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ మద్దతు తెలిపారని చెప్పారు.

kodandaram says tjs will support congress in telangana assembly election 2023 ksm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్‌ మద్దతు కోరామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ మద్దతు తెలిపారని చెప్పారు. ఈ రోజులు హైదరాబాద్‌ నాంపల్లిలో టీజేఎస్ కార్యాలయంలో కోదండరామ్, ఇతర ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, బోసు రాజు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు కోదండరామ్ సుముఖత వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీజేఎస్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఈ సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హైకమాండ్ సూచనతో కోదండరామ్‌తో భేటీ అయ్యామని చెప్పారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై చర్చించినట్టుగా తెలిపారు.  కాంగ్రెస్‌కు కోదండరామ్‌ మద్దుతు తెలిపారనిచెప్పారు.బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తామని వెల్లడించారు. ఇరు పార్టీల మధ్య అవహగహన పత్రం విడుదల చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్‌ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. లక్ష్యం పెద్దదని.. దాని కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించాలనేది తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై కోదండరామ్ పదేళ్లుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. 

కోదండరామ్ మాట్లాడుతూ.. తమకున్న సంశయాలు, ఆలోచనలు, భవిష్యత్తులో చేయాల్సిన కర్తవ్యాలకు సంబంధించిన అభిప్రాయాలను వారితో పంచుకున్నామని చెప్పారు. కేసీఆర్ నిరకుంశ పాలనను అంతమొందించుకే కలిసి పనిచేయాలని కోరారని.. అందుకు తాము కూడా సుముఖత వ్యక్తం చేశామని తెలిపారు. నవ తెలంగాణ నిర్మాణం సాధనగానే తాము మద్దతు తెలిపామని చెప్పారు. ఇరు పార్టీల మధ్య ఐక్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని.. ఇందుకు ప్రజలు, ఉద్యమకారులు అందరూ సహకరించాలని కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios