కొన్ని రోజులుగా తనను షాడో టీమ్‌లు వెంబడిస్తున్నాయని చెప్పారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ ఫోన్లను, ఆఖరికి తన వాట్సాప్ కాల్స్ ని ట్యాప్ చేయిస్తున్నారని టీజీఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. కొన్ని రోజులుగా తనను షాడో టీమ్‌లు వెంబడిస్తున్నాయని చెప్పారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

విపక్ష నాయకుల కార్లు మాత్రమే ఆపి సోదాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చర్చల దశలోనే కూటమి ఉందని...సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదని అన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో మహాకూటమి పడిందనడం అవాస్తవమని కోదండరాం స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు.
