స్పందించిన హెచ్ఆర్ సి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
ఖమ్మం జిల్లాలో ప్రబలిన విషజ్వరాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ఇవాళ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. జిల్లాలోని బోనకల్ మండలం రావినూతలలో విషజ్వరాల బారినపడి న గిరిజనులకు సరైన చికిత్స అందడం లేదని దీనిపై వెంటనే చర్యలు తీసుకోని బాధిత కుటుంబాలను ఆదుకోనేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన ఫిర్యాదులో కోరారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్ సి 15 రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఆదేశించింది.
Add Asianetnews Telugu as a Preferred Source

