కోదాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తి ఎస్ఐగా వుంటారని.. వద్దు అనుకుంటే తట్టా, బుట్టా సర్దుకుని పోతారని మల్లయ్య యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారమే తమ చేతిల్లో వుందని ఎంపీడీవో అయినా తహసీల్దార్ అయినా ఎమ్మెల్యేకు నచ్చిన వారే వస్తారని అన్నారు.

అయితే ఆయన ఈ వ్యాఖ్యలు కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ మీటింగ్‌లో చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది.