వరంగల్ కేఎంసీలో మెడికో ఆత్మహత్యాయత్నం: వేధింపులే కారణమంటున్న తండ్రి

వరంగల్  కేఎంసీలో  పీజీ మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసింది.  ఈ విషయాన్ని గుర్తించిన  తోటి విద్యార్ధులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

KMC  Medico  Preethi  Tries  Suicide in Warangal

వరంగల్:  వరంగల్  కేఎంసీలో  పీజీ మెడికో ప్రీతి   బుధవారం నాడు ఆత్మహత్యాయత్నం  చేసుకుంది.   సీనియర్ వేధింపులే  ప్రీతి  ఆత్మహత్యాయత్నానికి  కారణమని  బాధితురాలి  తండ్రి ఆరోపిస్తున్నారు.రెండు  రోజుల క్రితం సీనియర్  వైద్యులు డాక్టర్  ప్రీతిని వేధించారని  తండ్రి  చెబుతున్నారు. ఈ విషయమై  మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్  కు  కూడా ఫిర్యాదు  చేశారని సమాచారం.  ఇదే విషయమై  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందని  ప్రీతి తండ్రి  చెబుతున్నారు.  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసిన విషయాన్నిగుర్తించిన  సహచర వైద్యులు ఆమెకు  చికిత్స అందించారు.

అనంతరం మెడికో విద్యార్ధిని ప్రీతికి  ఎంజీఎం ఆసుపత్రిలో  చికిత్స ఇచ్చారు. . మెరుగైన చికిత్స కోసం  ఆమెను  హైద్రాబాద్  కు తరలించారు. విధుల విషయమై  సీనియర్లు  ప్రీతిని  వేధించినట్టుగా  పేరేంట్స్  చెబుతున్నారు.

ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందా లేదా  అనేది  ఇప్పుడే చెప్పలేమని  ఎంజీఎం  సూరింటెండ్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.  ప్రీతిని  రక్షించే ప్రయత్నించే  చేశామన్నారు.  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం  నిమ్స్  కు తరలించినట్టుగా  ఆయన చెప్పారు.ఇవాళ ఉదయం గుండెనొన్పి, తలనొప్పి అని  చెప్పిందని  డాక్టర్  చంద్రశేఖర్ మీడియాకు  చెప్పారు.   ప్రస్తుతం  ప్రీతి  స్పృహలో  లేదన్నారు. ప్రీతిని  రక్షించేందుకు  అన్ని రకాల  చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయమై  విచారణకు కమిటీలను  ఏర్పాటు  చేస్తున్నామని  డాక్టర్  చంద్రశేఖర్ తెలిపారు. 

సీనియర్ల వేధింపులపై  ఫిర్యాదు  చేసినా  కూడా  స్పందించలేదని   కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి  కూడా  తమకు  ఫోన్  చేసి  వరంగల్ కు రావాలని కోరినట్టుగా  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనకు  హస్టల్ లో  ఉండాలని  ఇష్టం  లేదని  ప్రీతి  కుటుంబసభ్యులకు  తెలిపింది. వరంగల్ లో  రూమ్ తీసుకుని ఉండాలని  కోరిందని  ప్రీతి బంధువులు   మీడియాకు చెప్పారు.  ఈ విషయమై నిన్న రాత్రి కూడా  తల్లికి  ఫోన్  చేసి ప్రీతి కోరిందని  బంధువులు  చెబుతున్నారు. ప్రీతి  తండ్రి  ఫిర్యాదు మేరకు  వరంగల్  మట్టెవాడ పోలీసులు  కేసు నమోదు  చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios