Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో కేసీఆర్ కుటుంబం కుర్చీ వేసుకుని కూర్చొన్న టీఆర్ఎస్ గెలవదు: కిషన్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మునుగోడులో కూడా వస్తాయని చెప్పారు.

Kishan reddy inspects bjp public meeting arrangement in munugode
Author
First Published Aug 20, 2022, 3:08 PM IST

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మునుగోడులో కూడా వస్తాయని చెప్పారు. రేపు మునుగోడులో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే సభ ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

మునుగోడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదని కిషన్ రెడ్డి అన్నారు. అయితే టీఆర్ఎస్ గందరగోళ పరిస్థితిలో పాలన సాగిస్తుందని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపును ఓర్వలేక తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందే అక్కడ రోడ్లు వేశారని అన్నారు. ఎన్నికల ముందు బీజేపీని బద్నామ్ చేయడం టీఆర్ఎస్‌కు అలవాటేనని అన్నారు. 

మాయమాటలతో ప్రజలను మభ్య పెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, తమ పార్టీలో అవినీతి లేదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం పీడ పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మునుగోడులో కేసీఆర్ కుటుంబం మొత్తం కుర్చీ వేసుకొని కూర్చున్నా టీఆర్ఎస్ గెలవదని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios