Asianet News TeluguAsianet News Telugu

80 వేల పుస్తకాలు చదివిన సీఎం కేసీఆర్ ఇదేనా .. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కిషన్ రెడ్డి సెటైర్..  

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. మరో వైపు ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. 

Kishan Reddy criticises KCR over Kaleshwaram Project KRJ
Author
First Published Oct 23, 2023, 7:15 AM IST

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకపడ్డారు. బ్యారేజీ కుంగిపోవడం విషయం తెలుసుకుని పరిశీలించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించేందుకు వెళ్తారని, వేలకోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టుపై మొదట్నుంచీ పలు అనుమానాలు వ్యక్తమయ్యాయని, నేడు వారి ఆందోళనలే నిజమయ్యాయని , వాస్తవం తేటతెల్లమైందని అన్నారు. సూపర్ ఇంజనీర్లు, డ్రీమ్ ప్రాజెక్టు అంటూ సీఎం కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారనీ, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంజినీర్ గా మారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఎద్దేవా చేశారు. నిపుణులు, ఇంజనీర్ల మాటల్ని పట్టించుకోకుండా నిర్మించిన ప్రాజెక్టు సమస్యలమయంగా మారిందని అన్నారు.

తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నష్టం కలిగించిందన్నారు. గతంలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో పంపుహౌజ్ మనిగిపోయి.. భారీ నష్టం వాటిల్లిందన్నారు. యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు అని గొప్పలు చెప్పారు. కానీ,  నిర్మాణంలో ప్రభుత్వం బొక్కబోర్లా పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపిందని విమర్శించారు.

ఏటా 400 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారనీ, 2019 జూన్ లో ప్రాజెక్టు ప్రారంభిస్తే..ఈ నాలుగేళ్లలో కేవలం 100కి పైగా టీఎంసీల నీళ్లు మాత్రమే ఎత్తిపోశారని, ఇది కేసీఆర్ నిర్మించిన  విచిత్రమైన ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు. 
ఈ బ్యారేజీ కుంగడం చిన్న విషయం కాదని, కేవలం ప్రచార ఆర్భాటం కోసం బీఆర్ఎస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు అనీ, ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. కాంగ్రెస్  ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ డ్యామ్ సేఫ్టీ మీద అథారిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ తయారుచేయాలని కోరారు. పూర్తి స్థాయిలో నష్టపోకుండా ముందుగానే సాధ్యమైనంత త్వరగా డ్యామ్ సేఫ్టీ అధికారులను ఏర్పాటు చేయాలన్నారు. 

కుంగిన లక్మీ బ్యారేజీ
 
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మి) గ్యారేజీ వంతెన శనివారం రాత్రి  ఒక్కసారిగా కుంగింది.మహాదేవపూర్ మండలం అంబటిపల్లి శివారులోని బీ బ్లాకులో 18, 19, 20, 21 పిల్లల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే పైన వంతెన దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios