Asianet News TeluguAsianet News Telugu

యజమానిని బంధించి, దాడి:గండిపేటలో భూకబ్జాకు దుండగుల యత్నం

రంగారెడ్డి జిల్లా గండిపేటకు సమీపంలోని మంచిరేవులలో భూకబ్జాదారులు తమ భూమిని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించారని కిరణ్ కుమార్ చెప్పారు. తమను బందించి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

kirankumar complaints against land grabbers in Ranga reddy district lns
Author
Hyderabad, First Published Jul 30, 2021, 12:28 PM IST

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని గండిపేటకు సమీపంలోని  మంచిరేవుల గ్రామంలో భూకబ్జాదారులు రెచ్చిపోయారు. తనను బంధించి భూకబ్జాదారులు దాడి చేశారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మంచిరేవుల గ్రామానికి చెందిన  220 సర్వే నెంబర్ లో 2.20 ఎకరాల భూమి ఉంది.ఈ భూమి  తమకు వారసత్వంగా దక్కిందని కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తమ భూమిని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించారని కిరణ్ కుమార్  ఆరోపించారు. సుమారు 40 నుండి 50 మంది వచ్చి తనను తాళ్లతో కట్టేసి దాడి చేశారన్నారు. మరోవైపు గ్రామస్థులు ఈ విషయాన్ని గుర్తించి దుండగులను పట్టుకొనే ప్రయత్నం చేస్తే తప్పించుకొన్నారన్నారు. అయితే గ్రామస్తులు అతి కష్టం మీద ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కిరణ్ కుమార్ రెడ్డి కి సంబంధించిన  గోడను కూడ జేసీబీ తో కూల్చివేశారని చెప్పారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.గొడవ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ  కెమెరాలను  కూడ ధ్వంసం చేశారని బాధితులు చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios