రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య నివాసంలో ఆరడుగుల విషపూరిత త్రాచు పాము శుక్రవారం మధ్యాహ్నం చొరబడింది. ఆ పామును మాజీ డీజీపీ రాజీవ్ త్రివేది చాకచక్యంగా నిర్బంధించారు.
హైదరాబాద్: త్రాచు పామును బంధించడం ప్రాణాలతో చెలగాటం ఆడటం వంటిదే. నైపుణ్యం లేదంటే అంతే సంగతులు. అదీ విషపూరితమైనది కావడంతో ప్రాణముప్పు ఎక్కువ ఉంటుంది. కానీ, మాజీ డీజీపీ రాజీవ్ త్రివేది మాత్రం ఆరు అడుగుల త్రాచు పామును విజయవంతంగా నిర్బంధించారు.
రాజధాని నగరం హైదరాబాద్ ప్రశాసనన్ నగర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య నివాసంలోకి ఓ త్రాచు పాము చొరబడింది. దీంతో ఇంట్లో భయాందోళలు ఏర్పడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ పాము కృష్ణయ్య నివాసంలోకి చొరబడింది. ఈ విషయం మాజీ డీజీపీ రాజీవ్ త్రివేదికి తెలిసింది. రాజీవ్ త్రివేది ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ పామును బంధించారు. ఆ తర్వాత ఆయన అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి రాగానే.. ఆ త్రాచుపామును వారికి అందించారు. ఆరడుగుల ఆ విషపూరిత త్రాచు పామును సురక్షితంగా అడవిలో వదిలేయాలని ఆయన అటవీ అధికారులను కోరారు. ఈ సాహస కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మాజీ డీజీపీ రాజీవ్ త్రివేదిపై ప్రశంసలు కురిపించారు.
