Asianet News TeluguAsianet News Telugu

భర్త మృతదేహం కోసం భార్య అగచాట్లు... కేసీఆర్ సాయాన్ని కోరిన మాజీ మంత్రి, కేటీఆర్ రియాక్ట్

కరోనాతో భర్తను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళకు సాయం చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి డికె శివకుమార్  తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. 

kindly help the family of Shashikala Manjunath... DK Shivakumar request to CM KCR akp
Author
Hyderabad, First Published May 31, 2021, 11:13 AM IST

హైదరాబాద్: కార్పోరేట్ హాస్పిటల్స్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తీరు మరోసారి బయటపడింది. కరోనాతో భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో వున్న మహిళను బిల్లు కట్టి మృతదేహాన్ని తీసుకుపోవాలంటూ హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్ వేధించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో సదరు మహిళ కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి డికె శివకుమార్ సాయం కోరగా ఆయన సోషల్ మీడియా వేదికన తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 

వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోకి మాండ్యాకు చెందిన శశికళ మంజునాథ్ అనే మహిళ భర్త కరోనాతో బాధపడుతూ హైదరాబాద్ లోని మెడికోర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇలా భర్త మరణించడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆమెను హాస్పిటల్ ఫీజు కట్టాలంటూ యాజమాన్యం వేధించింది. మొత్తం 7.5లక్షల బిల్లు కట్టి మృతదేహాన్ని తీసుకుని వెళ్లాలని సూచించింది. 

 

అయితే ఇప్పటికే భర్త వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు చేసినట్లు... తన వద్ద కేవలం రూ.2 లక్షలు మాత్రమే వున్నాయని తెలిపింది. అయితే ఆ డబ్బులు తీసుకొని మృతదేహాన్ని అప్పగించడానికి హాస్పిటల్ యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో ఆమె కర్ణాటక మాజీ మంత్రి డికె శివకుమార్ కు తన పరిస్థితిని తెలియజేసింది. 

వెంటనే స్పందించిన శివకుమార్ ఆమెకు సాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికన తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. ''మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స  పొందుతూ భర్తను కోల్పోయిన మాండ్యా జిల్లాకు చెందిన శశికళ మంజునాధ్ కు సాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతున్నా. అయితే హాస్పిటల్ బిల్లుు 7.5లక్షలు చెల్లించేవరకు మృతదేహాన్ని అప్పగించమని హాస్పిటల్ యాజమాన్యం చెబుతోందట. ఆమె మాత్రం రూ.2లక్షలు మాత్రమే చెల్లించగలని చెబుతోంది. కాబట్టి ఆమెకు సాయం చేసి భర్త మృతదేహాన్ని అప్పంగిచేలా చూడండి'' అంటూ తెలంగాణ సీఎం కార్యాలయానికి, కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు శివకకుమార్. 

read more  తెలంగాణలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 1,801 కేసులు.. పెరుగుతున్న రికవరీలు

ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. '' శివకుమార్ గారు... వెంటనే సదరు మహిళను సంప్రదించడానికి వివరాలివ్వండి. హాస్పిటల్ యాజమాన్యంతో సంప్రదించండి'' అంటూ తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు కేటీఆర్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios