వీధికుక్కల బెడద తొలగించుకోవడానికి ఓ గ్రామస్తులు చేసిన పని ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఓ వ్యక్తి 60 వీధికుక్కలను ఒక్కరోజులో చంపేశాడు. 

నల్గొండ : తెలంగాణలోని నల్గొండలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఒక్క రోజులో 60 వీధికుక్కలను హతమార్చాడు. మరో 60 కుక్కలను చంపేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయం వెలుగు చూసింది. కుక్క దాడులు పెరిగిపోవడంతో నల్గొండలోని వలిగొండ మండలం ఆరూర్ గ్రామస్తులు.. కుక్కలను చంపడానికి ఓ వ్యక్తిని నియమించారు.

ఆ వ్యక్తి ఒక్కరోజులోనే 60 కుక్కలను చంపాడు. కుక్కలకు ఆహారంలో విషం పెట్టి అందించాడు. దీంతో ఒక్కరోజు 60 కుక్కలు మృత్యువాత పడ్డాయి. మరో 60 కుక్కలను చంపాడనికి పథకం వేశాడు. ఈ విషయం వెలుగు చూడడంతో తమ నిర్షయాన్ని మార్చుకుని అతడిని తీసేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.