Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసం చేస్తున్న కిలాడీ లేడి.. అరెస్ట్ చేసిన పోలీసులు

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి నుంచి పలువురు వద్ద నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

Kiladi Lady cheating through fake profiles .. Arrested by the police
Author
Hyderabad, First Published Dec 6, 2021, 8:21 PM IST

సోష‌ల్ మీడియాలో న‌కిలీ అకౌంట్లు సృష్టించి మోసాల‌కు పాల్ప‌డుతున్న కిలాడీ లేడి గుట్టు ర‌ట్టు చేశారు పోలీసులు. ఆమె నుంచి రూ. 2,50,000, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివ‌రాల‌ను అడిష‌న‌ల్ డీసీపీ ఎస్‌.శ్రీ‌నివాస్ వెల్ల‌డించారు. ఓ మ‌హిళ గ‌త ఆరేళ్ల నుంచి వివిధ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఇత‌ర యాప్స్ నుంచి మ‌హిళల ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వారి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసింది. అనంత‌రం వాటితో మ‌గ‌వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించేంది.  వారి యాక్సెప్ట్ చేస్తే.. చాటింగ్ మొద‌లు పెట్టి అశ్లీల‌మైన ప‌దాలు వాడుతూ వారిని ముగ్గులోకి దించ‌డం అలవాటుగా చేసుకుంది. అనంత‌రం ఆ చాటింగ్ ను స్క్రీన్ షాట్ తీసి వారికే పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌స్తోంది. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే వాటిని బ‌య‌ట‌పెడ‌తానంటూ బెదిరించ‌డం ఆమెకు ప‌రిపాటిగా మారింది.

https://telugu.asianetnews.com/telangana/woman-had-illicit-affair-with-waste-picker-husband-murdered-him-in-shadnagar-murder-case-r3oe1q
ఆమెతో ఛాటింగ్ చేసిన వారు ఎక్క‌డ త‌మ ప‌రువు పోతోంద‌న‌ని అడిగినంత డ‌బ్బు ఇచ్చేసేవారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందిని మోసం చేసి రూ.20 ల‌క్ష‌లు డ‌బ్బులు సంపాదించింద‌ని పోలీసులు తెలిపారు. ఇలా మోసం చేయ‌డానికి ఆమె 12 ఎస్ఎంఎస్ కార్డుల‌ను ఉప‌యోగించింది. ఫేక్ అకౌంట్లు సృష్టించి మోసాల‌కు పాల్ప‌డుతున్న మ‌హిళ 2012లో వివాహం చేసుకుంద‌ని  పోలీసులు తెలిపారు. కానీ అత‌డికి విడాకులు ఇచ్చి మ‌ళ్లీ పెళ్లి చేసుకుంది. అత‌డితో కూడా క‌లిసి ఉండ‌కుండా గ‌త ఆరేళ్లుగా విడిగానే ఉంటుంది. ఇలా ఈజీ మ‌నీ కోసం మ‌గ‌వారితో చాటింగ్ చేసి బ్లాక్ మెయిల్ ల‌కు పాల్ప‌డుతోంది. ఆ మ‌హిళ బాధితుల్లో చాలా మందే ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. మోసాల‌కు పాల్ప‌డుతున్న మ‌హిళ నుంచి రెండు ల‌క్ష‌ల యాబై వేల రూపాయిలు, రెండు ఫోన్ల‌ను స్వాధీనం చేసుక‌న్నామ‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈమెపై ఇప్ప‌టి వ‌ర‌కు రెండు కేసులు న‌మోదై ఉన్నాయ‌ని పోలీసులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios