బీఆర్ఎస్‌కు షాక్ : కాంగ్రెస్‌లోకి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు.. తొలుత భర్త, రేపు భార్య

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. వీరు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. తొలుత రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు , రేపు ఎమ్మెల్యే ఆ పార్టీలో చేరనున్నారు. 

khanapur mla rekha nayak couple to join in congress ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ప్రకటించిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆయనను ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అలాగే రేపు రేఖా నాయక్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

ALso Read: బీఆర్ఎస్ తొలి జాబితా : రాజయ్యకు మొండిచేయి.. టికెట్లు రానిది వీరికే

కాగా.. ఇవాళ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి తొలి జాబితాలో రేఖా నాయక్‌కు చోటు దక్కలేదు. ఖానాపూర్‌లో బీఆర్ఎస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా నాయక్ బదులుగా కేటీఆర్‌కు సన్నిహితుడైన ఎన్ఆర్ఐ జాన్సన్‌కు టికెట్ ఇచ్చారు. రేఖా నాయక్ చుట్టూ వివాదాలు వున్నాయని.. అలాగే తన వైఖరితో సొంత కేడర్‌ను కూడా దూరం చేసుకున్నారనే విమర్శలు వున్నాయి. ఇంతటి వ్యతిరేక పరిస్ధితుల్లో ఆమెకు టికెట్ ఇచ్చినా ప్రయోజనం లేదనే ఉద్దేశంతో రేఖా నాయక్‌ను పక్కనబెట్టారు కేసీఆర్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios