హైద్రాబాద్ ఖైరతాబాద్ లో గణేష్ విగ్రహం తయారీకి సంబంధించి ఉత్సవ సమితి సోమవారం నాడు పూజలు నిర్వహించింది.
హైదరాబాద్: హైద్రాబాద్ ఖైరతాబాద్ లో గణేష్ విగ్రహం తయారీకి సంబంధించి ఉత్సవ సమితి సోమవారం నాడు పూజలు నిర్వహించింది. ఖైరతాబాద్ లో గణేష్ విగ్రహం తయారీ కోసం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత విగ్రహం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ నుండి నిమజ్జనం వరకు సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు ఉత్సవ కమిటీ.
ఈ ఏడాది 11 తలలతో నిలబడి ఉండే ఆకారంలో గణేష్ విగ్రహన్ని తయారు చేయనున్నారు. ఈ మేరకు శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో బృందం ఏర్పాట్లను చేస్తోంది. అయితే విగ్రహం ఎత్తు, నమూనాపై త్వరలోనే ప్రకటన చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు.
2019లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని 66 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా 2020లో గణేష్ విగ్రహన్ని 18 అడుగులకు మాత్రమే కుదించారు. కరోనాను పురస్కరించుకొని ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని ప్రత్యక్షంగా దర్శించుకొనేందుకు గత ఏడాది పోలీసులు అనుమతించలేదు. ఆన్‌లైన్ లోనే గణేష్ దర్శనం చేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ను ఎత్తివేసింది. కరోనాను పురస్కరించుకొని గణేష్ ఉత్సవ సమితి ఇవాళ నిర్వహించిన కర్రపూజను కూడ ఏకాంతంగానే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎవరిని కూడ అనుమతించలేదు. ఈ ఏడాది గణేష్ చతుర్ధి సమయంలో కరోనా కేసులను బట్టి ఖైరతాబాద్ విగ్రహం దర్శనం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
