Asianet News TeluguAsianet News Telugu

షర్మిలకి షాక్..కీలక నేత రాజీనామా..!

పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం జిల్లాల వారీగా అడహక్‌ కమిటీలను కూడా నియమించారు. పార్టీ ఏర్పాటు తర్వాత నేతల పనితీరును బట్టి పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. 

key leader resigns to sharmila party in Telangana
Author
Hyderabad, First Published Jun 16, 2021, 9:39 AM IST

తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమర్తె షర్మిల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే... పార్టీ పేరు ప్రకటించక ముందే... ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది.

షర్మిల ఇటీవల నియమించిన అడహక్‌ కమిటీకి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. తెలంగాణలో జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వైయస్‌ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం జిల్లాల వారీగా అడహక్‌ కమిటీలను కూడా నియమించారు. పార్టీ ఏర్పాటు తర్వాత నేతల పనితీరును బట్టి పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. 

అయితే పార్టీ పెట్టక ముందే షర్మిల నియమించిన హడక్ కమిటీలకు వైయస్‌ఆర్‌ అభిమానులు రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్‌హాక్ కమిటీకి రాజీనామా చేశారు.  ఇదే దారిలో మరి కొంత మంది షర్మిల నియమించిన హడక్ కమిటీకి రాజీనామాలు చేసేందు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన కొందరు అసలయిన వై.యస్.ఆర్ అభిమానులకి పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారట. కొత్తలోనే ఇలా ఉంటే ఇక పార్టీ ఏర్పాటు తర్వాత తమను మరింత తొక్కేస్తారనే బాధలో ఉన్నారట. దీంతో మొదట్లోనే తప్పుకోవడం మేలనే అభియానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ షర్మిల బుధ‌వారం నల్గోండ జిల్లా హుజూర్‌నగర్ లో పర్యటించనున్నారు. నిరుద్యోగంతో ఆత్మహత్యాయత్నం చేసిన‌ నీలకంఠసాయి అనే యువకుడిని ఆమె పరామర్శించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios