Asianet News TeluguAsianet News Telugu

ఎంపి క‌విత‌కు కేర‌ళ అసెంబ్లీ ఆహ్వానం

నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు క‌ల్వ‌కుంట్ల కవిత కు మరో అరుదైన గౌరవం లభించింది. దేశంలోని వివిధ విశ్వ‌విద్యాలయాల విద్యార్థుల‌తో కేర‌ళ అసెంబ్లీ నిర్వ‌హిస్తున్న‌ స‌ద‌స్సులో ప్ర‌సంగించాల్సిందిగా  క‌వితను కేర‌ళ అసెంబ్లీ స్పీక‌ర్ పి. శ్రీరామ‌కృష్ణ‌న్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఎంపి క‌విత‌ను ఆహ్వానిస్తూ లేఖ  రాశారు. 
 

kerala speaker invited to mp kavitha to participated assembly diamond jubilee celebrations
Author
Hyderabad, First Published Feb 4, 2019, 6:41 PM IST

నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు క‌ల్వ‌కుంట్ల కవిత కు మరో అరుదైన గౌరవం లభించింది. దేశంలోని వివిధ విశ్వ‌విద్యాలయాల విద్యార్థుల‌తో కేర‌ళ అసెంబ్లీ నిర్వ‌హిస్తున్న‌ స‌ద‌స్సులో ప్ర‌సంగించాల్సిందిగా  క‌వితను కేర‌ళ అసెంబ్లీ స్పీక‌ర్ పి. శ్రీరామ‌కృష్ణ‌న్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఎంపి క‌విత‌ను ఆహ్వానిస్తూ లేఖ  రాశారు. 

కేర‌ళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్స‌వాల్లో భాగంగా ఈ నెల 23  నుండి 25 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సును ఉప రాష్ట్ర ప‌తి  వెంక‌య్య‌నాయుడు 23న ప్రారంభించనున్నారు. అదే రోజు మ‌ధ్యాహ్నం తిరువనంతపురంలోని అసెంబ్లీ కాంప్లెక్స్ లో  క్యాస్ట్స్ అండ్ ఇట్స్ డిస్కంటెట్స్...అనే అంశంపై స‌ద‌స్సు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్ర‌స‌గించాల్సిందిగా ఎంపి క‌విత‌ను కేర‌ళ స్పీక‌ర్  కోరారు. కేర‌ళ సిఎం పినరయి విజయన్, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు దేశవ్యాప్తంగా 2 వేల మంది సామాజికంగా, రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా ఉన్న జాతీయ విద్యార్థులు ఈ స‌ద‌స్సులో పాల్గొంటార‌ని  రామ కృష్ణ‌న్ లేఖ‌లో పేర్కొన్నారు. 

 కేర‌ళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్స‌వాల‌ను గ‌త ఏడాది అగ‌స్టులో రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఉత్స‌వాల్లో  భాగంగా అనేక సెమినార్లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా మొద‌టి సెమినార్ గ‌త ఏడాది ఆగ‌స్టు 6-8 వ‌ర‌కు ఎస్సీ, ఎస్టీల సాధికార‌త స‌వాళ్లు అనే అంశంపై జ‌రిగింది. ఇప్పుడు రెండో సెమినార్ ను ఈ నెల 23-25 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.  

యువతలో ప్రజాస్వామిక‌ విలువలు, జీవన విధానం, మరియు ప్ర‌జాస్వామిక ఆలోచ‌నా దృక్ప‌థాన్ని పెంపోందించే ల‌క్ష్యంతో స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. కేర‌ళ అసెంబ్లీ,  ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ పార్లమెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ‌లు సంయుక్తంగా ఎంఐటి- వ‌ర‌ల్డ్ పీస్ యూనివ‌ర్శిటీ, పుణె సాంకేతిక స‌హ‌కారంతో ప్ర‌జాస్వామ్యం పై ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios