పేదోళ్ల పెళ్లికి  కెసిఆర్  పెద్ద చదివింపులు

 ఈ రోజు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన 2017-18 వార్షిక బడ్జెట్ ఒక విథంగా చూస్తే తెలంగాణాకు వరలా మూటే.

ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకయితే, ముఖ్యమంత్రి ఏకంగా కల్యాణ గంటలు మోగించారు.

2017-18 ఏడాది బడ్జెట్‌‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్దిదారులకుచదివింపులు రూ.75,116 పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

 ఇది వరకు ఈ పథకం కింద రూ. 51వేలు మాత్రమే సర్కార్ అందించేది. ఇకనుంచి పెళ్లి కూతర్లకు రు.75,116 ఇస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు.

 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటంబాలకు కళ్యాణ లక్ష్మీ పథకం, ముస్లీంలకు షాదీముబారక్ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే..