Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ ను చర్లపల్లి జైలుకు పంపుతా (వీడియో)

  • విశ్వసనీయత ఉంటే చర్చకు వచ్చేవాడివిగా
  • సోనియాగాంధీ కాళ్లు మొక్కిన విశ్వసనీయ కేసిఆర్ ది
  • అమరుల కుటుంబాల దగ్గరికి వెళ్లే దమ్ముందా?
  • ఉస్మానియా యూనివర్శిటీకి పోలేస్తవా? నేను పోతా
KCR will be sent charlapalli jail declares Revanth Reddy

ప్రభుత్వం చెబుతున్న విద్యుత్ వెలుగుల వెనక అవినీతి జరిగిందన్నది వందకు వంద శాతం నిజం. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ కేటాయింపులు... నాడు కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్ట్ లతోనే ఇప్పుడు మిగులు సాధ్యమైంది. విద్యుత్ వెలుగుల పై, కేసిఆర్ అవినీతి చర్చ కు రెడీ  అని సవాల్ విసిరిన టీఆరఎస్ నేతలు ఎటు పారిపోయారు.  టిఆర్ఎస్ సవాల్ స్వీకరించే మేము ఇప్పుడు గన్ పార్క్ దగ్గరికి వచ్చాము. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే టీఆర్ఎస్ వెనక్కి పోయింది ఎందుకో సమాధానం చెప్పాలి.

నా విశ్వసనీత కు కేసిఆర్ విశ్వసనీయతకు పోలికనా? నాడు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పోలవరం కాంట్రాక్టు లు దక్కించుకున్న కెసిఆర్ బండారాన్ని బయటపెట్టింది నేనే. వాస్తవాలు ఉంటనేనే.. నేను మాట్లాడుతాను. అమరుల కుటుంబాల దగ్గర కో ,ఓయూ విద్యార్థుల దగ్గరికో నేను వెళతా... మరి కేసిఆర్ పోతాడా? విశ్వసనీయత ఉంటె  కేసీఆర్ రావాలి. ఎవరి విశ్వసనీయత ఏంటో తెలుస్తుంది. తెలంగాణ ఇచ్చిన సోనియా కు కాళ్ళు మొక్కిన కెసిఆర్ విశ్వనీయత జనాలకు తెలుసు.

బిహెచ్ఎల్ కు టెండర్లు పిలవకుండా 30,400 కోట్ల పనులు ఎందుకు ఇచ్చారో చెప్పాలి. బిహెచ్ఎల్ తో కేసీఆర్ తన బినామీలకు పనులు ఇప్పించుంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల జెన్కో కు ఐదు వేల కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని కేసీఆర్ భరిస్తారా? మంత్రి భరిస్తారా? పవర్ ప్రాజెక్టుల్లో దోపిడీ చేసేందుకే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ని కేసీఆర్ ఎంచుకున్నారు. అధికారు లు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ చెప్పినట్లు వింటే భవిష్యత్ లో జైలుకే వెళ్లడం ఖాయం. ఇండియా బుల్స్ కంపెనీ ఇచ్చే కమిషన్ లకు ప్రభుత్వం కక్కుర్తి పడింది.

జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నవి పచ్చి అబద్ధాలు. మూడున్నర ఏళ్లలో  లగడపాటి ,జూపల్లి రామేశ్వర్ రావు, సీమాంధ్ర నేతల కంపెనీల నుండి విద్యుత్ ను కొనుగోలుచేసింది నిజం కాదా? ఏపీ లో మిగులు విద్యుత్ అందుబాటులో ఉంటె.. ప్రయివేట్ కంపెనీల నుండి ఎక్కువ ధరకు కొన్నది నిజం కాదా ? తక్కువ ధరకు ఏపీ విద్యుత్ ఇస్తామన్నా మీరు కోననిది నిజం కాదా ? మిగులు విద్యుత్ అందుబాటులో ఉంటె ప్రాజెక్ట్ లకు 40వేల కోట్లు  అప్పులు తీసుకు రావడం దేనికి ? నేను ప్రభుత్వ అవినీతి నిరూపించక పోతే అబిడ్స్ లో ముక్కు నెలకు రాస్త.

సీబీఐ కి ఇస్తారా ,,సెంట్రల్ విజిలెన్స్ విచారణ కు ఇస్తారో మీ ఇష్టం. కెసిఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే నా సవాల్ ను స్వీకరించాలి. ప్రభుత్వం తీరుతో భవిష్యత్ లో వినియీగదారు లకు భారంగా మారనుంది. ఒక్క బిహెచ్ఏఎల్ టెండర్ల లోనే కెసిఆర్ తన బినామీ లతో ఐదు వేల కోట్లు దోచుకున్నారు. కెసిఆర్ బతుకు ,బండారం నా దగ్గర ఉన్నాయి. కెసిఆర్ పాపాల చిట్టా ఒక్కొక్కటి విప్పుతాము. ప్రగతి భవన్ కాదు ..చర్లపల్లి జైలుకు పంపిస్తాం. 

రేవంత్ గన్ పార్కు వద్ద ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడండి. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios