Asianet News TeluguAsianet News Telugu

నేడే న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం: చేరుకున్న కేసీఆర్ సతీమణి శోభ

బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ,  ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వచ్చారు. ఇవాళే న్యూఢిల్లీలో  బీఆర్ఎస్ కొత్త  కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

KCR Wife Shobha Reaches  BRS New office in New delhi
Author
First Published Dec 14, 2022, 11:39 AM IST

హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యాలయానికి  సీఎం కేసీఆర్  సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితతో పాటు  పలువురు మంత్రులు, పలువురు  ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు  బుధవారంనాడు ఉదయమే చేరుకున్నారు.  న్యూఢిల్లీలోని  సర్ధార్ పటేల్  రోడ్డులో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యాలయంలో నిన్న ఉదయం నుండి  ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజశ్యామల యాగం కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ  మద్యాహ్నం 12:37 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.  

బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి  పలు రాష్ట్రాలకు చెందిన నేతలకు  కేసీఆర్ ఆహ్వానం పంపారు.  సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్,  ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, రైతు సంఘాల నేత  రాకేష్ తికాయత్ తదితరులు  రానున్నారు.  ఇవాళ మంచి ముహుర్తం  ఉన్నందున  బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా  మార్చారు.ఈ మేరకు ఈ ఏడాది అక్టోబర్  5వ తేదీన  తీర్మానం చేసింది ఆ పార్టీ.ఈ తీర్మానం కాపీనీ ఈసికి పంపారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  ఈసీ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు  ఈసీ నుండి కేసీఆర్ కు లేఖ అందింది.  ఈ నెల 9వ తేదీన  ఈసీ పంపిన లేఖపై కేసీఆర్  సంతకం చేసి తిరిగి ఈసీకి పంపారు. 

దేశ వ్యాప్తంగా  పార్టీని విస్తరించడానికి వీలుగా  టీఆర్ఎస్  పేరును మార్చారు కేసీఆర్.  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  పార్టీని  విస్తరించేందుకు  కేసీఆర్  ప్లాన్ చేస్తున్నారు.2024 లో జరిగే  ఎన్నికల్లో కేంద్రంలో  బీజేపీని అధికారంలోకి రాకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో  బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో  కేసీఆర్ ఇప్పటికే  చర్చలు జరిపారు.  ముందుగా నిర్ణయమైన షెడ్యూల్ నేపథ్యంలో  ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కావడం లేదు. 

తెలంగాణ రాష్ట్రంలో  అభివృద్ది సాధ్యమైన విషయాన్ని కేసీఆర్ పదే పదే గుర్తు చేస్తున్నారు. తెలంగాణ తరహలో  కష్టపడితే  దేశం కూడా అభివృద్ది పథంలో  ముందుకు  సాగేదనే కేసీఆర్ గుర్తు చేస్తున్నారు. కానీ బీజేపీ అవలంభించిన విధానాల కారణంగా  దేశం ఆర్ధికంగా  అధోగతి పాలైందని  కేసీఆర్ విమర్శిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios