Asianet News TeluguAsianet News Telugu

ఇదేమిటి?: కడియం, పల్లాల తీరుపై కేసీఆర్ అసంతృప్తి

టీఆర్ఎస్‌లోని పలువురు  ముఖ్య నేతల తీరుపై  ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం..

kcr unhappy on kadiayam and palla rajeswar reddy
Author
Hyderabad, First Published Oct 9, 2018, 2:16 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్‌లోని పలువురు  ముఖ్య నేతల తీరుపై  ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.విపక్షాలు చేస్తున్న  విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడంలో మంత్రులు, పార్టీ నేతలు తిప్పికొట్టడంలో వైఫల్యం చెందుతున్నారని  కేసీఆర్  అభిప్రాయంతో ఉన్నారని సమాచారం.

ఎన్నికల సమయంలో  పార్టీ నేతలు కీలకంగా వ్యవహరించాల్సిన నేతలు   ఆ రకంగా వ్యవహరించకపోవడంపై  కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీలో ప్రచారంలో ఉంది. 

మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ ఛైర్మెన్లు  విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడంలో  విఫలమయ్యారని కేసీఆర్ అభిప్రాయంతో ఉన్నాడంటున్నారు. 

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  కాంగ్రెస్ నేతలతో పాటు విపక్షాలపై  విమర్శలు చేస్తున్నారు. ఘాటైన పదజాలంతో కేసీఆర్ ప్రత్యర్థులను చీల్చిచెండాడుతున్నాడు. అయితే ఈ తరుణంలో  విపక్షాలు కూడ కేసీఆర్‌పై ఘాటుగానే విమర్శలు ఎక్కు పెడుతున్నారు. 

మాజీ మంత్రి డీకె అరుణ, మాజీ ఎంపీ మధుయాష్కీ, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి  లాంటి నేతలు కేసీఆర్‌ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ విమర్శలకు ధీటుగా సమాధానాన్ని టీఆర్ఎస్‌ నుండి ఇవ్వలేకపోయారనే చర్చ కూడ లేకపోలేదు. 

నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో  టీఆర్ఎస్ నాయకత్వం అనుసరించిన తీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.నల్గొండ సభ ఏర్పాట్ల విషయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీరుపై  కూడ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్  నియోజకవర్గంలో  టీఆర్ఎస్  అభ్యర్థి  రాజయ్యకు  వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు  కేటీఆర్‌ వద్ద ఫిర్యాదు చేశారు. రాజయ్యను మార్చాలని డిమాండ్ చేశారు.  

ఈ వ్యవహరంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అనుచరులు కూడ ఉన్నారు. మరోవైపు కడియం కుటుంబసభ్యులకు ఈ స్థానం నుండి  పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు కూడ ప్రచారం సాగింది.  రాజయ్య విషయంలో అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తి పర్చేలా కడియం శ్రీహరి చర్యలు తీసుకోలేదని కేసీఆర్ అసంతృప్తితో ఉన్నాడనే ప్రచారం కూడ ఉంది. 

మరోవైపు మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలువురు చట్టసభల సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్ల విషయంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇదే అభిప్రాయంతో ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios