Asianet News TeluguAsianet News Telugu

మరో రెండు రోజులు హస్తినలోనే కేసీఆర్: ప్రధాని సహా పలువురితో భేటీ


తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు న్యూఢిల్లీలోనే ఉండనున్నారు. ఇవాళ  ప్రధాని మోడీతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్  తో భేటీ కానున్నారు. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  కేసీఆర్ భేటీ కానున్నారు.

KCR to meet prime minister Modi today
Author
Hyderabad, First Published Sep 3, 2021, 11:50 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 1వ తేదీన న్యూఢిల్లీకి చేరుకొన్నారు.ఈ నెల 2వ తేదీన న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో టీఆర్ఎస్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ హైద్రాబాద్ కు రావాల్సి ఉంది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడంపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో  కేసీఆర్ భేటీ అవుతారు.  తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిల నిధులపై చర్చించనున్నారు.కృష్ణా, గోదావరి  ప్రాజెక్టుల విసయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ పై కూడ కేసీఆర్ చర్చించనున్నారు.ఈ విషయమై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో కేసీఆర్ చర్చించనున్నారు. 

ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండానే ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై  తెలంగాణ ప్రభుత్వం  అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడ  తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయనుంది.ఈ నెల 4వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ అమిత్ షాతో భేటీ కానున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios