Asianet News TeluguAsianet News Telugu

కొత్త సచివాలయం నిర్మాణానికి 27న కేసీఆర్ శంకుస్థాపన

: ఈ నెల 27వ తేదీన కొత్త తెలంగాణ సచివాలయ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు వాస్తు నిపుణుల సూచన మేరకు భూమి పూజ కోసం స్థలాన్ని గుర్తించారు.

KCR to lay stone for new Secretariat on June 27
Author
Hyderabad, First Published Jun 25, 2019, 12:05 PM IST

హైదరాబాద్: ఈ నెల 27వ తేదీన కొత్త తెలంగాణ సచివాలయ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు వాస్తు నిపుణుల సూచన మేరకు భూమి పూజ కోసం స్థలాన్ని గుర్తించారు.

ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలోని ప్రధాన బ్లాక్‌గా ఉన్న సీ బ్లాక్‌కు ఈశాన్య ప్రాంతంలో భూమిపూజ చేయాలని వాస్తు నిపుణులు సూచించారు. ఈ మేరకు వాస్తు నిపుణులు మంగళవారం నాడు  పరిశీలించారు. వాస్తు నిపుణుల సూచన మేరకు భూమి పూజ చేసే ప్రదేశాన్ని ఫైనల్ చేశారు.

ఏపీకి చెందిన భవనాలను కూడ తెలంగాణకు అప్పగించారు. ఈ తరుణంలో 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ భావించారు.తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. 9 మాసాల్లో ఈ భవనాన్ని పూర్తి చేయాలని  సర్కార్ ప్లాన్ చేస్తోంది.

అయితే తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ కొందరు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 27వ తేదీన ఈ విషయమై హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో  తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయడం లేదని హైకోర్టుకు తెలంగాణ సర్కార్ అఫిడవిట్‌ను ఇచ్చింది. 

ఈ విషయాన్ని కూడ పిటిషనర్లు గుర్తు చేస్తున్నారు.కొత్త సచివాలయం నిర్మాణం కోసం  ఇప్పటికే ఆర్‌అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో  కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. తొలుత డీ బ్లాక్‌ను  కూల్చివేయనున్నారు. ఆయా బ్లాకుల్లోని శాఖలను, మంత్రుల పేషీలను ఆయా శాఖల హెచ్ఓడీ కార్యాలయాలకు తరలించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios