హైదరాబాద్: సురేష్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నప్పుడు తాము ఎమ్మెల్యేలుగా ఉండటం తమ అదృష్టం అని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో సురేష్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయనతో ఉన్న పరిచయాన్ని గుర్తు చేశారు ఈటల. తెలంగాణ వాదానికి సురేష్ రెడ్డి అండగా నిలిచారని కొనియాడారు.  

మరోవైపు కొండగట్టు ప్రమాద ఘటనతో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తీవ్రంగా కలత చెందారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో సభకు రావొద్దని సురేష్ రెడ్డితోపాటు ఇతర నేతలు సూచించడంతో కేసీఆర్ రాలేకపోయారని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ త్వరలోనే నిజామాబాద్‌ జిల్లాలో పర్యటిస్తారని ఈటల తెలిపారు.