హైదరాబాద్: పార్టీ నేతలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంక్షలు విధించారు. టీవీ చానెల్స్ నిర్వహించే చర్చలకు హాజరు కావద్దని ఆయన వారిని ఆదేశించారు.

గురువారం జరిగిన పార్టీ నేలత సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ వైఖరిపై స్పష్టత తీసుకోకుండా టీఆర్ఎస్ నేతలు టీవీ చానెల్స్ చర్చల్లో పాల్గొనకూడదని, వేర్వేరు పార్టీలు తమ పార్టీ వైఖరులను స్పష్టం చేయడానికి ఆ చర్చలు వీలు కల్పిస్తున్నాయని, అందువల్ల చర్చలకు వెళ్లకూడదని ఆయన చెప్పారు. 

తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎవరు కూడా టీవీ చానెల్ చర్చలకు వెళ్లకూడదని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. ఇతర పార్టీలు తమ అధికార ప్రతినిధులను లేదా ఎంపిక చేసిన నేతలను టీవీ చర్చలకు పంపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు మాత్రం అటువంటి ఏర్పాటు లేదు. టీవీ చర్చలకు వెళ్లే నేతలకు అవగాహన ఇచ్చే ఏర్పాటు జరుగుతుందని అంటున్నారు.