Asianet News TeluguAsianet News Telugu

రేపే కేసీఆర్ సహస్ర చండీయాగం: 300 మంది రుత్వికులు

ఐదు రోజుల పాటు సాగే ఈ యాగంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు. గోపూజ అనంతరం యాగం ప్రారంభమవుతుంది. ఈ యాగంలో 300 మంది రుత్వికులు పాల్గొంటారు. 

KCR supervises arrengements made for Chandi yagam
Author
Erravalli, First Published Jan 20, 2019, 8:15 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీయాగం చేయనున్నారు. ఈ యాగం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లను ఆహ్వానించారు. మాడుగుల మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాపే, ఫణి శశాంక శర్మ, భద్రకాళి వేణు తదితర వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతుంది.

ఐదు రోజుల పాటు సాగే ఈ యాగంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు. గోపూజ అనంతరం యాగం ప్రారంభమవుతుంది. ఈ యాగంలో 300 మంది రుత్వికులు పాల్గొంటారు. యాగానికి చేసిన ఏర్పాట్లను కేసీఆర్ ఆదివారం పర్యవేక్షించారు.

"

Follow Us:
Download App:
  • android
  • ios