Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్ర వ్యాప్తంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ: కేసీఆర్

తెలంగాణలో గజ్వేల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ లో  బుధవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 
 

kcr starts kanti velugu programme at Malkapur village in Medak district
Author
Medak Road, First Published Aug 15, 2018, 3:52 PM IST


మెదక్:అమెరికాలో మాదిరిగానే తెలంగాణలో కూడ  అండర్ గ్రౌండ్  డ్రైనేజీని  ఏర్పాటుచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.  ఈ మేరకు టెక్నికల్‌‌గా సాధ్యాసాధ్యాలను  పరిశీలన జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. 

తెలంగాణలో గజ్వేల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ లో  బుధవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించినట్టు కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే 40 లక్షల కళ్లద్దాలను తెప్పించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని 3 కోట్ల70 లక్షల కంటి పరీక్షలు నిర్వహిస్తామని  చెప్పారు. కాటరాక్ట్   ఆపరేషన్లను కూడ  ఉచితంగా నిర్వహించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 825 టీములు  కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ కోరారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.

కులాలు, మతాలు, స్త్రీ, పురుషులు అనే తేడాల కారణంగా ఐక్యత లేకుండా ఉంటుందన్నారు.  ఎక్కడా కూడ  మన దేశంలోనే  ఐక్యత లేకుండా  ఉందన్నారు. అవకాశం వస్తే మహిళలు  అద్భుతంగా పనిచేస్తారని చెప్పారు. 

జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రి హరీష్ రావు మంచోళ్లు అని చెప్పారు. తాను కూడ మంచోడినేనని కేసీఆర్ చెప్పారు.విద్యుత్ కష్టాలు ఇక మన దరిచేరవన్నారు. మంచినీళ్ల సమస్య కూడ రాదన్నారు. రాష్ట్రంలోని 20వేల గ్రామాలకు ఇప్పటికే రక్షిత మంచినీటిని అందిస్తున్నట్టు చెప్పారు. దీపావళికి మంచినీరు అన్ని గ్రామాలకు మంచినీరు అందిస్తామన్నారు.

మిషన్ కాకతీయతో  చెరువులను నింపినట్టు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 60 వేల కోట్లను ఖర్చు చేస్తున్ట్టు చెప్పారు. 

తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.ఈ మేరకు పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాదికి మల్కాపూర్ గ్రామానికి గోదావరి నీళ్లు వస్తాయనిచెప్పారు.

మల్కాపూర్ గ్రామానికి ప్రత్యేకంగా రూ.6 లక్షలు  మంజూరు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.  మరో వైపు మల్కాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిని కోరినట్టు చెప్పారు.  ఈ మేరకు  ధర్మారెడ్డి కూడ సానుకూలంగా స్పందించినట్టు ఆయన గుర్తు చేశారు.

మల్కాపూర్ గ్రామానికి ప్రతి ఇంటికి రెండు పాడిగేదేలను మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. మల్కాపూర్ గ్రామానికి వంద డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.

మరో వైపు ఈ గ్రామానికి చెందిన 700 మంది తమ కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.ఈ మేరకు  తమ సమ్మతిని తెలుపుతూ ఇచ్చిన  పత్రాలను సీఎం కేసీఆర్ కు గ్రామస్తులు అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios