కోదాడ: నేను  తెలంగాణ ప్రజల ఏజంట్‌ను మాత్రమేనని ఎవరి ఏజంట్‌ను కాదని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు. 

కోదాడలో సోమవారం నాడు  నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొన్నారు.నేను తెలంగాణ ప్రజల ఏజంటు‌ అని కేసీఆర్ చెప్పారు. మోడీ తెలంగాణలో కరెంట్ లేదంటాడు. నిజంగా కరెంటు వస్తలేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ  చీఫ్  రాహుల్ గాంధీ నన్ను  మోడీ బీ టీమ్ అని విమర్శిస్తున్నారని చెప్పారు.

నేను తెలంగాణ ప్రజల ఏజంటు‌ అని కేసీఆర్ చెప్పారు.  బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో  తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టుగా రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకాలను చూసి మహరాష్ట్రలోని 19 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని తీర్మానం చేసినట్టుగా  ఆయన  గుర్తు చేశారు.

 ప్రపంచంలో రైతు భీమా పథకం ఎక్కడ అమలు చేయడం లేదన్నారు.  రాష్ట్రంలో ఇప్పటికే 4వేల మందికి ఈ స్కీమ్ ను అమలు చేసినట్టు చెప్పారు.  కోదాడ ప్రాంతానికి  సాగు నీటిని  నీరిస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు. శశిధర్ రెడ్డి కష్టకాలంలో పార్టీని కాపాడారని గుర్తుచేశారు.  శశిధర్ రెడ్డికి  ఎమ్మెల్యే స్థాయి పదవిని ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.