హైదరాబాద్:తెలుగు జాతి అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ వాసుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.మంచిగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు చేస్తున్నారని చెప్పారు. 

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత కేసీఆర్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు.

తెలుగు జాతి అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ వాసుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.హైద్రాబాద్ విశ్వనగరమని... ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ఈ నగరం సర్వ మతాలు, కులాలకు సొత్తని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నారని చెప్పారు.

హైద్రాబాద్ లో నివాసం ఉంటున్న  ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారితో పాటు, రాయలసీమ వాసులు క్షేమంగానే ఉంటున్నారన్నారు. హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నవారంతా తెలంగాణ వాసులేనని తాను చెప్పడమే కాదు నాలుగేళ్ల పాలనలో అమలు చేసి చూపినట్టు చెప్పారు.

చంద్రబాబునాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం  హైద్రాబాద్‌లోని తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. హైద్రాబాద్ వాసుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న బాబుకు బుద్దిచెప్పాలని కేసీఆర్ కోరారు.

మన నగరం మంచి నగరం దీన్ని కాపాడుకొంటున్నట్టు కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ కు చిల్లర రాజకీయాలు లేవన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందినవారు వేరే ప్రాంతానికి చెందినవారమనే భావాన్ని వీడాలని కేసీఆర్ కోరారు.

హైద్రాబాద్ వాసులుగా గర్వంగా  ఉండాలని కేసీఆర్ చెప్పారు. మీతో కేసీఆర్ ఉంటారని ఆంధ్ర, రాయలసీమవాసులకు హామీ ఇచ్చారు.నేను హైద్రాబాద్ వాసిని కాదు. నేను ఉమ్మడి మెదక్ జిల్లా నుండి వచ్చినట్టు కేసీఆర్ గుర్తు చేశారు. కేశవరావు కూడ హైద్రాబాద్ వాసి కాదన్నారు.

చంద్రబాబునాయుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. బాబుకు ఏ అవసరమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇంత కుట్ర చేయాల్సిన అవసరం వచ్చిందా అడిగారు. ఏపీలో 175 నియోజకవర్గాలున్నాయన్నారు. తెలంగాణలో టీడీపీ 13 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందా అని కేసీఆర్ ప్రశ్నించారు.

వెకిలి, చిల్లర రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఏ రాజకీయాలను ఆశించి చంద్రబాబునాయుడు ఇక్కడికి వచ్చాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.మంచిగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు చేస్తున్నారని చెప్పారు. 


సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ మేనిఫెస్టో: ఉద్యోగుల రిటైర్మెంట్ మూడేళ్లు పెంపు